కుప్పం ఘటనపై ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు
Chandrababu fire On Kuppam Hotel Incident.
By Medi Samrat Published on 16 May 2022 3:49 PM IST
కుప్పం పట్టణంలోని హర్షిత డాబాలో వైసీపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు గణపతి,అరవింద్ విధ్వంసం సృష్టించారని ఆరోపణలు చేస్తున్నారు. డాబాలో భోజనం లేదని వారిద్దరికీ చెప్పడంతో హోటల్లోని వస్తువులను ధ్వంసం చేశారని హోటల్ యజమాని చెప్పుకొచ్చారు. హోటల్ ని కాల్చివేస్తామని బెదిరించారని హోటల్ యజమానులు తెలిపారు. కుప్పం బైపాస్ రోడ్డులో ఈ దాబా ఉంది. దాబాలో వైసీపీ నేతలు చేసిన దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియలో వచ్చాయి.
వైసీపీ కుప్పంలో దాడుల సంస్కృతిని తీసుకురావడం దురదృష్టకరమని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కుప్పంలోని ఓ హోటల్ (దాబా) పై వైసీపీ కౌన్సిలర్లు చేసిన దాడిని ఆయన ఖండించారు. హోటల్ లో ఫర్నిచర్ ను ధ్వంసం చేసి మహిళలను బెదిరించారని, ఈ దారుణ ఘటనపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని చెప్పారు.
కుప్పంలో హోటల్ పై వైసిపి కౌన్సిలర్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. కుప్పంలో ఎప్పుడూ లేని దాడుల సంస్కృతిని వైసిపి తీసుకురావడం దురదృష్టకరం. భోజనం అయిపోయిందన్న పాపానికి స్థానిక హోటల్ పై వైసిపి ప్రజా ప్రతినిధులు దాడి చెయ్యడం దారుణం.(1/2) pic.twitter.com/mfdFBuPu02
— N Chandrababu Naidu (@ncbn) May 16, 2022