సీబీఐ విచారణ జరిగే వరకూ వదిలిపెట్టం : చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు అంగళ్ల ఘటనపై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు.

By Medi Samrat  Published on  9 Aug 2023 2:44 PM IST
సీబీఐ విచారణ జరిగే వరకూ వదిలిపెట్టం : చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు అంగళ్ల ఘటనపై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. విజయనగరంలో ఆయ‌న మాట్లాడుతూ.. ఎక్కడికి వెళ్లినా నాపై దాడికి యత్నిస్తున్నారు. అంగళ్లలో నన్ను చంపాలనే వారు వచ్చారని.. ఎన్‌ఎస్ జీ, మీడియా, ప్రజలు సాక్షిగా నాపై దాడి జరిగిందని అన్నారు. నాపై చాలా సార్లు హత్యాయత్నం చేయాలని ప్లాన్ చేశారని.. సైకో ముఖ్యమంత్రి అదేశాలతోనే నాపై హత్యాయత్నం జ‌రిగింద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

సైకో చెప్పాడు కాబట్టే మంత్రి పెద్దిరెడ్డి, అతడి తమ్ముడు నాపై దాడికి యత్నించారని ఆరోపించారు. అంగళ్లకు చేరుకునే లోపే రూ.5 వేల కోట్ల స్కామ్ ను బయట పెట్టానని అన్నారు. రెండు ప్రాజెక్ట్ ల ద్వారా మంత్రి పెద్ది రెడ్డి సుమారు రూ. 3 వేల కోట్ల స్కామ్ చేశారని ఆరోపించారు. మీ అక్రమాలు బయటపెట్టానని నన్ను చంపాలని యత్నిస్తారని ఆరోపించారు.

దాడులు చేసి, తిరిగి నాపై కేసులు పెడతారా.. నాతో ఎవరు వస్తే వాళ్లపై కేసులా..? అని ప్ర‌శ్నించారు. బెదిరించి స్టేట్‌మెంట్‌లు తీసుకుని కేసులు పెడుతున్నారని అన్నారు. విలువలు కలిగిన అశోక్ గజపతి రాజుపై కేసులు పెట్టి వేధించారని ఫైర్ అయ్యారు. ఈనాడు రామోజీ రావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవి 5 పై, ఎందరో నేతలపై కేసులు పెట్టారని అన్నారు

చిరంజీవి మాట్లాడితే ఆయనపై మాటల దాడి చేస్తున్నారు. పోలీసులను పార్టనర్స్ ను చేసి, వారి అరాచకాలకు పోలీసులను వినియోగిస్తున్నారని ఆరోపించారు. రాత్రి నేను వస్తుండగా కోరుకొండలో విద్యుత్ కోతలు విధించారని ఆరోపించారు. మాకు పోలీసులు ప్రత్యర్ధులు కాదు. రాష్ట్రాన్ని నాశనం చేస్తుంటే నేను రాజకీయంగా మాట్లాడితే నాపై దాడి చేసి హత్య చేస్తారా అని ప్ర‌శ్నించారు. నా ప్రోగ్రామ్ కి వైసీపీ వాళ్ళు ఎందుకు వస్తారని సందేహం వ్య‌క్తం చేశారు. ఇన్ని కేసులు పెట్టినా నేను ఎన్నడూ భయపడలేదు.. అంగళ్ల ఘటనపై సీబీఐ విచారణ జరగాల్సిందేన‌న్నారు.

పిచ్చోడి చేతిలో రాయి ఉంటే, వాడినైనా కొట్టుకుంటాడు. లేదా మనల్నైనా కొడతాడు. ఈ రాష్ట్రంలో అదే జరుగుతోందని వ్యాఖ్‌యానించారు. ఘ‌ట‌న‌పై రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, రాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామ‌ని తెలిపారు. సీబీఐ విచారణ జరిగే వరకు వదిలిపెట్టమ‌ని.. లీగల్ గా, పొలిటికల్ గా ఫైట్ చేసి.. ప్రజా క్షేత్రంలో వారిని దోషులుగా నిలబెడతామ‌న్నారు. ప్రజలు తిరుగుబాటు చేస్తే వైసీపీ నేతలు పారిపోవాల్సిందేన‌న్నారు.

Next Story