తనతో పాటు కేసుల్లో ఉన్నవారికి రాజ్యసభ సీటు ఇచ్చారు

Chandrababu Fire On CM Jagan. టీడీపీ అధికారంలోకి రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని ఆ పార్టీ అధినేత

By Medi Samrat  Published on  22 May 2022 9:47 AM GMT
తనతో పాటు కేసుల్లో ఉన్నవారికి రాజ్యసభ సీటు ఇచ్చారు

టీడీపీ అధికారంలోకి రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర పునర్నిర్మాణం చేయాలని చెప్పారు. బోస్టన్‌లో నిర్వహించిన మహానాడులో చంద్రబాబు వ‌ర్చువ‌ల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బోస్టన్‌లో 2,200 మందితో మహానాడు నిర్వహణ గర్వకారణమన్నారు. సీఎం జగన్‌ పాలనలో రాష్ట్రం కోలుకోలేనంతగా నష్టపోయిందని విమ‌ర్శించారు. తనతో పాటు కేసుల్లో ఉన్నవారికి జగన్‌ రాజ్యసభ సీటు ఇచ్చారని ఆరోపించారు.

వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకే ఇస్తామని ప్రకటించారు. టీడీపీని అధికారంలోకి తీసుకురావడంలో ఎన్‌ఆర్‌ఐలు కృషి చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఏపీలో అరాచకం, విధ్వంసం రాజ్యమేలుతున్నాయని విమ‌ర్శించారు. ధరలు భారీగా పెంచేశారని.. వైసీపీ నేతలను ఎక్కడికక్కడ ప్ర‌జ‌లు నిలదీస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. ఇక‌.. ఏపీలో విద్యుత్తు కోతలతో పారిశ్రామికవేత్తలు పెట్టుబ‌డులు పెట్ట‌డానికి ఆస‌క్తి చూప‌డం లేద‌ని చంద్ర‌బాబు చెప్పారు.
Next Story
Share it