జనసేన నేతల అక్రమ అరెస్టులను ఖండించిన‌ చంద్రబాబు

Chandrababu condemns police searches in Vizag hotel. జనసేన పార్టీ అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ బస చేసిన విశాఖపట్నంలోని

By Medi Samrat
Published on : 16 Oct 2022 4:03 PM IST

జనసేన నేతల అక్రమ అరెస్టులను ఖండించిన‌ చంద్రబాబు

జనసేన పార్టీ అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ బస చేసిన విశాఖపట్నంలోని హోటల్‌లో పోలీసులు సోదాలు చేయడాన్ని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదివారం ఖండించారు. సోదాలు ఆంధ్రప్రదేశ్‌లో నియంతృత్వ పాలనను ప్రతిబింబిస్తున్నాయని చంద్రబాబు విలేకరులతో అన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను అవలంబిస్తున్నదని చంద్రబాబు ఆరోపించారు.

జనసేన చేపట్టిన 'జనవాణి' కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఖండనీయమని అన్నారు. విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో శనివారం జరిగిన ఘటనకు సంబంధించి జనసేన నాయకులను అరెస్టు చేయడాన్ని కూడా చంద్రబాబు ఖండించారు. విమానాశ్రయంలో వైసీపీ నేతల కాన్వాయ్‌లపై రాళ్లు రువ్విన తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు. పోలీసులు అరెస్టు చేసిన జనసేన నాయకులు, కార్యకర్తలందరినీ వెంటనే విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.


Next Story