మరోసారి భేటీ కానున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. అందుకేనట..!

టీడీపీ, జనసేన పార్టీలు.. ఏపీ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయనున్నాయి. అభ్యర్ధుల ఎంపిక విషయంలో ఆదివారం నాడు

By Medi Samrat  Published on  5 Feb 2024 1:00 PM GMT
మరోసారి భేటీ కానున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. అందుకేనట..!

టీడీపీ, జనసేన పార్టీలు.. ఏపీ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయనున్నాయి. అభ్యర్ధుల ఎంపిక విషయంలో ఆదివారం నాడు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో రెండు పార్టీల అధినేతలు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అయితే కొన్ని స్థానాల విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదని తెలుస్తూ ఉంది. అందుకోసమే మరోసారి ఇరు పార్టీల అధినేతలు భేటీ అవ్వనున్నారు. అందుకు ఫిబ్రవరి 8వ తేదీని నిర్ణయించారు.

ఉమ్మడి మేనిఫెస్టో, సీట్ల సర్దుబాటుపై విడతలవారీగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చించారు. ఆదివారం ఉండవల్లిలో భేటీ అయిన ఇద్దరు అధినేతలు కీలక అంశాలపై చర్చించారు. జనసేన పోటీ చేసే స్థానాల్లో టీడీపీ ఆశావహులకు టీడీపీ పోటీ చేసే స్థానాల్లో జనసేన ఆశావహులకు ఇరు పార్టీల అధినేతలు సర్ది చెప్పాలని నిర్ణయించుకున్నారు. కొందరు నేతలు త్యాగాలకు సిద్ధం కావాలని ఇప్పటికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్పష్టత ఇచ్చారు. పొత్తులో సీటు సర్దుబాటు కాని నేతలకు పార్టీ, ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తానని చంద్రబాబు నాయుడు కూడా హామీ ఇచ్చారు.

Next Story