ఈ హత్యల్లో చంద్రబాబు, లోకేష్‌లను కూడా ముద్దాయిలుగా చేర్చాలి

వైసీపీ కార్యకర్త సుబ్బారాయుడు కుటుంబ సభ్యులను వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు

By Medi Samrat
Published on : 9 Aug 2024 3:30 PM IST

ఈ హత్యల్లో చంద్రబాబు, లోకేష్‌లను కూడా ముద్దాయిలుగా చేర్చాలి

వైసీపీ కార్యకర్త సుబ్బారాయుడు కుటుంబ సభ్యులను వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని.. ఊళ్లలో ఆధిపత్యం కోసం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. పోలింగ్‌ బూత్‌లో ఏజెంట్‌గా కూర్చున్నాడని సుబ్బారాయుడిని చంపేశారని వైఎస్ జగన్ ఆరోపించారు.

పోలీసుల ఎదుటే నిందితులు ఉన్నా పట్టుకోవడం లేదని ఆరోపించారు వైఎస్ జగన్. నిందితులు పారిపోవడానికి పోలీసులు సహకరించారని.. హత్య చేసిన వాళ్లు ఎవరు.. చేయించిన వాళ్లు ఎవరని వైఎస్ జగన్ ప్రశ్నించారు. నిందితుల కాల్‌ డేటా చూస్తే ఎవరు చేయించారో తెలుస్తుందని.. హత్య చేయించిన వారిని కూడా జైల్లో పెట్టాలన్నారు. ప్రతీచోటా ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయని అన్నారు.

తుపాకులు, కత్తులు, రాడ్లు, కర్రలతో వైసీపీ నేతలపై దాడులు చేస్తున్నారని.. చంద్రబాబు, నారా లోకేష్‌ అండదండలతో ఎస్‌ఐ సమక్షంలో నరికేశారన్నారు వైఎస్ జగన్. టీడీపీ ఎమ్మెల్యేలు మీటింగ్స్ పెట్టి చంపండి అంటూ చెబుతున్నారు.. ఈ హత్యల్లో చంద్రబాబు, లోకేష్‌లను కూడా ముద్దాయిలుగా చేర్చాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.ఈ

Next Story