వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజనిపై కేసు నమోదయింది. యడ్లపాడు పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఆమెతో పాటు మరో 21 మంది వైసీపీ నేతలపై కూడా కేసు నమోదయింది. జనవరి 30న యడ్లపాడులోని దేవస్థానానికి తన అనుచరులతో పాటు విడదల రజని వెళ్లారు. తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని చెపుతూ ఆలయాన్ని శుద్ధి చేయడానికి ఆమె యత్నించారు. అయితే, ఆలయంలోకి వెళ్లకుండా టీడీపీ నేతలు ఆమెను అడ్డుకున్నారు. అక్కడకు చేరుకున్న పోలీసులు వైసీపీ నేతలకు సర్దిచెప్పి వెనక్కి పంపించారు. ఈ క్రమంలో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించారంటూ విడదల రజని, ఆమె అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.