తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీ ఫెక్సీలు, హోర్డింగులు వెలిశాయి. విజయవాడ, గుంటూరు, కొత్తపేట, యానాం, కడియం, కాకినాడ, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, కృష్ణా, ముమ్మిడివరం సహా పలు పట్టణాలు, నగరాల్లోని రద్దీ ప్రాంతాల్లో బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్, ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ తరపున శుభాకాంక్షలు తెలుపుతూ భారీ పెక్సీలు ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉంటే.. ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ సభ కోసం పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు దాదాపు ఐదు లక్షల మందిని తరలించాలని పార్టీ నేతలు బావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో వివిధ జిల్లాలో జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలను తరలించేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఈ సభ కోసం ఆంధ్ర ప్రదేశ్ నుంచి కూడా పెద్ద ఎత్తున జనసమీకరణ చేస్తున్నట్లు తెలుస్తోంది.