ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఏకగ్రీవం

విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం ఏకగ్రీవంగా విజయం సాధించారు

By Medi Samrat
Published on : 16 Aug 2024 12:45 PM

ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఏకగ్రీవం

విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం ఏకగ్రీవంగా విజయం సాధించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎన్నికల ధ్రువీకరణ పత్రాన్ని సత్యనారాయణకు అందజేశారు. ఆయన మూడేళ్లపాటు ఈ పదవిలో ఉంటారు. మొత్తం 836 ఓట్లలో వైఎస్సార్‌సీపీకి 530కి పైగా ఓట్లు వచ్చాయి. ఎన్నికల్లో పోటీకి టీడీపీ కూటమి దూరంగా ఉంది.

జాయింట్‌ కలెక్టర్‌ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు సర్టిఫికెట్‌ తీసుకున్న తర్వాత బొత్స మీడియాతో మాట్లాడారు. బీ ఫామ్‌ ఇచ్చి పోటీకి ప్రొత్సహించిన పార్టీ అధ్యక్షుడు వైఎస్‌​ జగన్‌ మోహన్‌ రెడ్డికి, సహకరించిన జిల్లా నేతలకు ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. కూటమి పార్టీలు పోటీ చేయ‌కూడ‌ద‌ని నిర్ణయించడంతో వైసీపీ అభ్యర్థి బొత్స ఎన్నిక ఏక‌గ్రీవం అయ్యింది. ఈ ఎన్నికలకు సంబంధించి ప‌లు ర‌కాలుగా క‌స‌ర‌త్తులు చేసిన కూటమి నేతలు.. చివ‌రికి పోటీ చేయ‌కూడ‌ద‌నే నిర్ణయానికి వ‌చ్చేశారు. నామినేష‌న్ చివ‌రి రోజున ఈ పోటీకి దూరంగా ఉండాల‌ని నిర్ణయం తీసుకోవ‌డంతో బొత్స గెలుపు ఖ‌రారైంది.

Next Story