విశాఖలోనే సీఎం జగన్ ప్రమాణ స్వీకారం

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

By Medi Samrat  Published on  15 May 2024 4:15 AM GMT
విశాఖలోనే సీఎం జగన్ ప్రమాణ స్వీకారం

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రెండు మూడు రోజుల్లో ప్రమాణ స్వీకారానికి తేదీ కూడా ప్రకటిస్తామని.. రాష్ట్రంలో జరిగిన పోలింగ్‌ ను చూస్తుంటే ఫ్యాన్‌ గాలి బలంగా వీచిందని అన్నారు. జూన్ 4వ తేదీన ఊహించని ఫలితాలు రానున్నాయని.. సీఎం వైఎస్‌ జగన్‌ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మహిళలందరి మద్దతు సీఎం వైఎస్‌ జగన్‌కే ఉందన్నారు బొత్స సత్య నారాయణ. మహిళలంతా వైఎస్సార్‌సీపీకే ఓటు వేశారని తెలిపారు. లబ్ధి పొందిన ప్రతి మహిళా మళ్ళీ సీఎంగా వైఎస్‌ జగన్‌ కావాలని కోరుకుంటున్నారన్నారు. మళ్లీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వస్తే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని భావించి ఓట్లు వేశారన్నారు. చంద్రబాబు అధికార దాహంతో అనేక రకాల కుయుక్తులకు పాల్పడ్డాడని, స్థాయికి తగని తప్పుడు భాష వాడారని అన్నారు. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై ప్రజల్లో ఆందోళన కలిగించేందుకు కుటిల యత్నాలు చేశాడని విమర్శించారు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా చంద్రబాబు ఓటమి ఖాయమైందని, ఆయనకు ఓటమి భయం పట్టుకుందని అన్నారు బొత్స. వైఎస్సార్‌సీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తారని.. ఎవరూ ఉద్రిక్తతకు లోనుకాకుండా సంయమనం పాటించాలని సూచించారు.

Next Story