నాకు అడ్రస్ వుంది.. చంద్రబాబు, లోకేష్ అడ్రస్ ఎక్కడ.?
Botsa Satyanarayana Fires On Chandrababu. రాజధాని విశాఖకు తరలింపు ఖాయమని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
By Medi Samrat Published on
27 Aug 2021 2:30 PM GMT

రాజధాని విశాఖకు తరలింపు ఖాయమని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. శుక్రవారం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ కామెంట్స్ చేశారు. రాజధాని తరలింపుపై ఉండే సాంకేతిక సమస్యలపై కోర్టులను ఒప్పిస్తామని అన్నారు. ప్రతి కార్యక్రమాన్ని ప్రతిపక్షాలు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని.. చంద్రబాబు, లోకేష్‌కు అడ్రస్ ఎక్కడ.? నాకు అడ్రస్ వుంది.. ఆయనకు వుందా.. అని ప్రశ్నించారు.
చంద్రబాబు కూ, లోకేష్ కూ ఇళ్ళులు ఎక్కడ వున్నాయి..? రాష్ట్ర ప్రజల కోసమే పనిచేస్తున్నామంటూ ప్రక్క రాష్ట్రంలో వుంటారా అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో వుండగానే జగన్ తాడేపల్లి లో ఇళ్ళు ఏర్పాటు చేసుకున్నారని.. చంద్రబాబును ఇళ్ళు ఎక్కడవుందో చెప్పమనండి.. ఆయన మాకు నీతులు, సుద్దులు చెబుతారా.. అని మండిపడ్డారు. అమరావతి కౌలు రైతులకు ముందుగానే కౌలు చెల్లిస్తున్నామని మంత్రి బొత్స తెలిపారు.
Next Story