ప‌వన్ కల్యాణ్‌తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భేటీ

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో గురువారం సాయంత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఆర్గనైజేషన్ జనరల్ సెక్రెటరీ ఎన్.మధుకర్ భేటీ అయ్యారు

By -  Medi Samrat
Published on : 23 Oct 2025 8:50 PM IST

ప‌వన్ కల్యాణ్‌తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భేటీ

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో గురువారం సాయంత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఆర్గనైజేషన్ జనరల్ సెక్రెటరీ ఎన్.మధుకర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆర్.ఎస్.ఎస్. చీఫ్ మోహన్ భగవత్ ఆదివాసీ యోధుడు బిర్సా ముండా గురించి రాసిన పుస్తకాన్ని పవన్ కల్యాణ్‌కు అందించారు. వీటితోపాటు భారత భారతి సంస్థ స్వాతంత్ర్య సమరయోధుల జీవితాల గురించి ప్రచురించిన 175 పుస్తకాలను ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా బిర్సా ముండా జయంతి వేడుకల గురించీ, స్వదేశీ వస్తువుల వినియోగాన్ని విస్తృతం చేయడం గురించి ఉప ముఖ్యమంత్రితో చర్చించారు.

Next Story