ఏపీకి జేపీ నడ్డా రాక.. ఏమన్నారంటే..
BJP National Leader JP Nadda AP Visit. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు
By Medi Samrat
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. బీజేపీ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గాన నడ్డా విజయవాడ చేరుకున్నారు. సిద్దార్ధ హోటల్ మేనేజ్ మెంట్ కాలేజీ ప్రాంగణంలో భారీ సభలో నడ్డా ప్రసంగించారు. రాజకీయాల్లో మార్పు తెచ్చేందుకే మనం ఉన్నామని.. ప్రతి కార్యకర్త ఇంటిపై బీజేపీ జెండా ఎగరాలనిజేపీ నడ్డా అన్నారు. విజయవాడలో నిర్వహించిన శక్తి కేంద్రాల సమావేశంలో మాట్లాడుతూ.. అర్జునుడు తపస్సు చేసిన ప్రాంతమిదని అన్నారు. మార్పు కోసం మనం ప్రతి ఇంటి తలుపు తట్టాలన్నారు. ఏపీలో పదివేలకు పైగా శక్తి కేంద్రాలున్నాయన్నారు. ప్రతి శక్తి కేంద్రంలోకి ఐదారు పోలింగ్ బూత్ లు వస్తాయన్నారు.
రాష్ట్రంలోని పోలింగ్ కేంద్రాలను బీజేపీ శక్తికేంద్రాలుగా మార్చింది. వాటికి ఇన్ఛార్జ్ లను నియమించింది. ఈ నేపథ్యంలో ఆయా శక్తి కేంద్రాల ఇన్‌ఛార్జ్ లతో విజయవాడలో నడ్డా భేటీ అవుతారు. సాయంత్రం ఐదు గంటలకు విజయవాడ నగర, ఎన్టీఆర్ జిల్లా పుర ప్రముఖులతో సమావేశం కానున్నారు. రాత్రి బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ, ప్రధాన కార్యదర్శులతో సమావేశమవుతారు. అందులో పార్టీ భవిష్యత్ వ్యూహాలపై చర్చిస్తారు. రాత్రికి విజయవాడలోనే బసచేయనున్న నడ్డా.. మంగళవారం ఉదయం కనకదుర్గమ్మను దర్శించుకుంటారు. కేంద్ర పభుత్వ పథకాల లబ్ధిదారులతో సమావేశమై సాయంత్రానికి ఢిల్లీ వెళ్తారు.