ఏపీలో బీజేపీ నాయకుడు హత్య.. కొడవళ్లతో వెంబడించి చంపిన దుండగులు

BJP Kisan Morcha leader found murdered in Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట గ్రామ శివారులో శనివారం బీజేపీ కిసాన్ మోర్చా నాయకుడు మల్లారెడ్డి శవమై కనిపించారు.

By అంజి  Published on  20 Feb 2022 10:02 AM IST
ఏపీలో బీజేపీ నాయకుడు హత్య.. కొడవళ్లతో వెంబడించి చంపిన దుండగులు

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట గ్రామ శివారులో శనివారం బీజేపీ కిసాన్ మోర్చా నాయకుడు మల్లారెడ్డి శవమై కనిపించారు. శుక్రవారం రాత్రి నుంచి కనిపించకుండా పోయాడు. బీజేపీ నాయకుడి మృతదేహం లభ్యం కావడంతో డీఎస్పీ నాగేశ్వర్ రెడ్డి తన బృందంతో ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణలో మల్లారెడ్డి మృతిని హత్యగా పరిగణిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. బీజేపీ రాష్ట్ర శాఖ చీఫ్ ఎస్ వీర్రాజు, ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్‌తో మాట్లాడి సమగ్ర విచారణ జరిపి మల్లారెడ్డి హత్య వెనుక ఉన్న వారిని త్వరగా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

వత్సవాయి మండలం లింగాల గ్రామంలో 35 ఏళ్ల బీజేపీ కిసాన్ మోర్చా నాయకుడు హత్యకు గురయ్యాడు. మృతుడు లెంకల మల్లారెడ్డి కిసాన్ మోర్చా కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి. జగ్గయ్యపేట చిట్యాల గ్రామానికి చెందిన మల్లారెడ్డి వ్యవసాయ సంబంధిత వస్తువులను కొనుగోలు చేసేందుకు వత్సవాయికి వెళ్లినట్లు నందిగామ డీఎస్పీ జి.నాగేశ్వర రెడ్డి తెలిపారు. తిరిగి ఇంటికి వస్తుండగా రాత్రి 11 గంటల సమయంలో లింగాల గ్రామం వద్ద వేగంగా వచ్చిన కారు ఆయన బైక్‌ను ఢీకొట్టింది. వారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా కారులోని దుండగులు కొడవళ్లతో వెంబడించారు.

"మల్లా రెడ్డి శరీరంపై అనేక కత్తి గాయాలతో గ్రామ శివారులో రక్తపు మడుగులో కనిపించాడు. గ్రామంలోని ఓ వర్గంతో అతడికి ఏర్పడిన విభేదాలు ఈ దారుణ హత్యకు దారితీసి ఉండవచ్చు. మల్లారెడ్డి తల్లి ఫిర్యాదు మేరకు దర్యాప్తు కొనసాగుతోందని డీఎస్పీ తెలిపారు. "కేసు నమోదు చేయబడింది. ఫేస్‌బుక్‌లో ఒక నిర్దిష్ట వర్గానికి వ్యతిరేకంగా అతను చేసిన వివాదాస్పద పోస్ట్‌లను కూడా పరిశీలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందిగామ జీజీహెచ్‌కు పంపించాం'' అని డీఎస్పీ తెలిపారు.

Next Story