పవన్ మాటల్లో మరింత స్పష్టత రావాల్సి ఉంది: సోము వీర్రాజు

BJP Cheif Somu Veerraju About Pawan Kalyan Words. గత కొద్దికాలంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు బీజేపీకి కాస్త కొత్తగా ఉన్న సంగతి తెలిసిందే

By Medi Samrat  Published on  15 Jan 2023 3:45 PM IST
పవన్ మాటల్లో మరింత స్పష్టత రావాల్సి ఉంది: సోము వీర్రాజు

గత కొద్దికాలంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు బీజేపీకి కాస్త కొత్తగా ఉన్న సంగతి తెలిసిందే..! బీజేపీ-జనసేన పొత్తు కొనసాగుతూ ఉన్నా.. టీడీపీతో పవన్ కళ్యాణ్ మాత్రం దోస్తానాను కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే బీజేపీకి-టీడీపీకి గత ఎన్నికల సమయంలో వచ్చిన గ్యాప్ అలాగే కొనసాగుతూ ఉంది. ప్రస్తుత పరిస్థితులను ఏపీ బీజేపీ విభాగం నిశితంగా గమనిస్తూ వస్తూ ఉంది.

బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తాజాగా స్పందించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటలు కొత్తగా ఉన్నాయని, ఆయన వ్యాఖ్యల్లో మరింత స్పష్టత వస్తే అందరి కత్తులకు పదునెక్కుతాయని అన్నారు. పవన్ వైఖరికి అనుగుణంగానే రాష్ట్ర రాజకీయాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. రణస్థలం యువశక్తి సభలో పవన్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే టీడీపీకి ఆయన దగ్గరవుతున్నట్టుగా అర్థమవుతోందని, దీనిపై మీ అభిప్రాయమేంటన్న ప్రశ్నకు వీర్రాజు ఈ వ్యాఖ్యలు చేశారు. పవన్ మాటల్లో మరింత స్పష్టత రావాల్సి ఉందని చెప్పుకొచ్చారు సోము వీర్రాజు.


Next Story