బండ్ల గణేష్ కౌంటర్ ఎవరికి.?

ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ మరోసారి సంచలన ట్వీట్స్ వేశారు.

By Medi Samrat
Published on : 15 March 2025 6:49 PM IST

బండ్ల గణేష్ కౌంటర్ ఎవరికి.?

ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ మరోసారి సంచలన ట్వీట్స్ వేశారు. అయితే ఆయన సూటిగా ఎవరిని అన్నారో మాత్రం చెప్పలేదు.

“కృతజ్ఞత లేకుండా బతకడం మానవత్వాన్ని కోల్పోవడమే,

ద్రోహంతో బతకడం మనుష్యత్వాన్ని నాశనం చేసుకోవడమే.”

ఒక మనిషి జీవితంలో కృతజ్ఞత ఎంత ముఖ్యమో, ద్రోహం ఎంత ప్రమాదకరో స్పష్టంగా తెలియజేస్తుంది. మనం ఎప్పుడూ కృతజ్ఞతతో జీవించాలి….!" అంటూ శనివారం ఉదయం ఓ పోస్టు పెట్టారు.

మధ్యాహ్నం “జీవితంలో ఎవరైనా నీకు సహాయం చేస్తే, దాన్ని రాయిపై చెక్కించుకున్నట్టు గుర్తుంచుకో.

కానీ, నువ్వు ఎవరైనా సహాయమైతే, దాన్ని నీటిపై వ్రాసినట్టు మర్చిపో.”

నిజమైన మంచితనం అంటే మళ్లీ ఏమి ఆశించకుండా చేయడం..!" అంటూ మరో ట్వీట్ వేశారు.

ఇప్పుడు ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఇంతకూ బండ్ల గణేష్ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారా అని చర్చించుకుంటూ ఉన్నారు.

Next Story