వైసీపీకి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజీనామా

ఏపీలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు

By Medi Samrat  Published on  18 Sep 2024 11:34 AM GMT
వైసీపీకి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజీనామా

ఏపీలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేర‌కు రాజీనామ లేఖను పార్టీ అధినేత జగన్‌కు పంపించారు. శ్రీనివాస్ రెడ్డి లేఖ‌లో.. కొన్ని కారణాల రీత్యా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు. రాష్ట్రం ప్రగతి పధంలో వెళ్తే ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా అభినందిస్తాను, కారణం అంతిమంగా ప్రజాశ్రేయస్సే రాజకీయాలకు కొలమానం కదా.. విలువలను నమ్ముకొనే దాదాపు 5 సార్లు ప్రజా ప్రతినిధిగా 2 సార్లు మంత్రిగా పని చేసాను అన్న తృప్తి, కొంత గర్వం కూడా ఉంది. రాజకీయాలు వేరు, బంధుత్వాలు వేరు, వైఎస్ఆర్ కుటుంబానికి సన్నిహితుడుని అయినా.. జగన్ మోహన్ రెడ్డి రాజకీయ నిర్ణయాలు సరిగా లేనపుడు ఖచ్చితంగా అడ్డుకొన్నా.. ఎలాంటి మొహమాటాలకు నేను పోలేదు. అంతిమం గా ప్రజాతీర్పుని ఎవరైనా హుందా గా తీసుకోవాల్సిందే. నేను ప్రజా నాయకుడిని, ప్రజల తీర్పే నాకు శిరోధార్యం.. రాజకీయాల్లో భాష గౌరవంగా హుందాగా ఉండాలని నమ్మే నిఖార్సైన రాజకీయం నేను చేసాను, కారణం లక్షల మంది ప్రజలు మనల్ని ఆదర్శంగా తీసుకొన్నపుడు అన్ని విధాలా విలువలను కాపాడాల్సిన భాద్యత మనదే. రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ వ్యక్తి నా దగ్గరకు వచ్చినా నేను నా శక్తి మేరకు సహాయం చేసానని పేర్కొన్నారు.


Next Story