జనసేనకు 50 సీట్లు ఇచ్చినా ఉపయోగం లేదు

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి, ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు

By Medi Samrat  Published on  18 Feb 2024 9:00 PM IST
జనసేనకు 50 సీట్లు ఇచ్చినా ఉపయోగం లేదు

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి, ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవర్ షేరింగ్ లేనప్పుడు పవన్‌కు పార్టీ ఎందుకని ప్రశ్నించారు. షేరింగ్‌ లేకపోతే జనసేనకు 50 సీట్లు ఇచ్చినా ఉపయోగం లేదన్నారు. పవన్ కల్యాణ్ ఎందుకు పార్టీ పెట్టారో ఆయనకే తెలియదని విమర్శించారు. ఇలా చేసే బదులు ఆయన టీడీపీ పార్టీలో చేరితే సరిపోతుందని అన్నారు. ఎవరిని ఉద్దరించడానికి పార్టీ పెట్టారని పవన్ కళ్యాణ్ ను అవంతి ప్రశ్నించారు. మళ్లీ ఏపీలో వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని జోస్యం చెప్పారు. ఎవరెన్ని కుట్రలు చేసినా జగన్ రెండోసారి ముఖ్యమంత్రి కాకుండా ఆపలేరని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేక పూర్తిగా ఆంధ్రాను వదిలేసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లోనే ఉండిపోతారని అన్నారు. తాను భీమిలి నుంచే పోటీ చేస్తానని చెప్పారు. ఆ నియోజకవర్గంలో తాను గెలవడం ఖాయమని అన్నారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ పర్యటనలో ఉన్నారు. పవన్ విశాఖలో నేడు, రేపు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర పార్టీ ముఖ్యనేతలతో జనసేనాని వరుసగా భేటీ కానున్నారు. జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో కూడా పవన్ పాల్గొనే అవకాశం ఉంది. విశాఖ పర్యటన కోసం ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకోవాల్సి ఉన్న జన సేన అధినేత పవన్ పర్యటన ఆలస్యం కానుంది. పవన రావాల్సిన స్పెషల్ ఫ్లైట్ మరో రెండు గంటలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. నావికాదళం మిలాన్ రిహార్సల్స్ జరుగుతున్నందు వల్ల పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫ్లయిట్‌కు నేవి అధికారుల నుంచి క్లియరెన్స్ రాకపోవడమే పవన్ పర్యటన ఆలస్యానికి కారణమని తెలుస్తోంది.

Next Story