టీడీపీ కార్యాలయాలపై దాడి

Attack On TDP Offices. ఏపీ రాజకీయం ఒక్క‌సారిగా వేడెక్కింది. టీడీపీ పార్టీ కార్యాలయాలపై గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు

By Medi Samrat  Published on  19 Oct 2021 7:32 PM IST
టీడీపీ కార్యాలయాలపై దాడి

ఏపీ రాజకీయం ఒక్క‌సారిగా వేడెక్కింది. టీడీపీ పార్టీ కార్యాలయాలపై గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు దాడులు చేయ‌డంతో ఏపీలో పొలిటిక‌ల్ హీట్ రాజుకుంది. సీఎం జగన్‌ను టీడీపీ నేతలు విమర్శించడాన్ని నిరసిస్తూ వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌గా.. అదే స‌మ‌యంలో పలు జిల్లాల్లో టీడీపీ కార్యాలయాలు, నేతల నివాసాలపై దాడులు జ‌ర‌గ‌డంతో.. వైసీపీ కార్య‌క‌ర్త‌లే దాడుల‌కు పాల్ప‌డ్డారంటూ టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఇదిలావుంటే.. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడికి పాల్పడ్డారు.

ఈ దాడిలో కార్యాలయం అద్దాలు, ఫర్నిచర్‌ ధ్వంసమయ్యాయి. కార్యాలయం వద్ద నిలిపి ఉంచిన వాహనాలపై కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేశారు. దీంతో కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. దాడి సమయంలో టీడీపీ కార్యాలయంలో ఉన్న కెమెరామెన్‌ బద్రీకి తీవ్రగాయాలయ్యాయి. దీంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడిని నిరసిస్తూ ఆపార్టీ శ్రేణులు జాతీయరహదారిపై ధర్నాకు దిగారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయమేర్పడింది. టీడీపీ కార్యాలయంపై దాడి విషయం తెలుసుకున్న పార్టీ శ్రేణులు మంగళగిరిలోని కార్యాలయానికి భారీగా తరలివచ్చారు. విజయవాడలోని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి నివాసంపై కూడా దాడి జ‌రిగింది.


Next Story