తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరైంది. సోంపేట అదనపు కోర్టు అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరు చేసింది. నిమ్మాడ ఘటనలో అచ్చెన్నకు ఫిబ్రవరి 2న కోటబొమ్మాలి కోర్టు రిమాండ్ విధించింది. అప్ప‌టి నుండి క‌ష్ట‌డీలో ఉన్న‌ అచ్చెన్నాయుడుతో పాటు 21 మందికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.

రూ. 50 వేల వ్య‌క్తిగ‌త‌ పూచీకత్తుతో అచ్చెన్నకు బెయిల్ మంజూరు అయ్యింది. దీంతో అచ్చెన్నాయుడు రేపు జైలు నుంచి విడుదల కానున్నారు. ఇదిలావుంటే.. అచ్చెన్నాయుడు సొంత ఊరు నిమ్మాడలో ఆయన స‌తీమ‌ణి సర్పంచ్ పదవికి నామినేషన్ వేశారు. అయితే.. వైసీపీ అక్క‌డ సర్పంచ్ అభ్య‌ర్థిగా అచ్చెన్నాయుడు బంధువును బ‌రిలోకి దింపింది. దీంతో అచ్చెన్నాయుడు ఎన్నిక‌ బ‌రిలో ఉన్న ఆ‌ బంధువుకు ఫోన్ చేసి బెదిరించనట్లుగా ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.


సామ్రాట్

Next Story