ఐఎండీ సూచనల ప్రకారం పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీర ప్రాంతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో రేపు మోస్తారు వర్షాలు.. ఆదివారం, సోమవారం అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి గంటకు 50-60 కీ.మీ వేగంతో గాలులు వీసి.. సముద్రం అలజడిగా ఉంటుందని.. మత్స్యకారులు ఎవరూ మంగళవారం వరకు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని సూచించింది.
రాగల మూడు రోజుల వాతావరణ వివరాలు :-
జూలై 10 శనివారం :- ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు మిగిలినచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం.
జూలై 11 ఆదివారం :- కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం
జూలై 12 సోమవారం :- రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలినచోట్ల మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ కమిషనర్ కె. కన్నబాబు తెలిపారు.