AP Assembly : విద్యార్థులకు స్పీకర్ బంఫ‌రాఫ‌ర్‌.. ప్రతిరోజు 100 మందికి ఛాన్స్‌..!

ఏపీలో చదువుకునే విద్యార్థులకు అసెంబ్లీ సమావేశాలు చూసే అవకాశం క‌ల్పించారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు.

By Medi Samrat  Published on  25 July 2024 6:30 PM IST
AP Assembly : విద్యార్థులకు స్పీకర్ బంఫ‌రాఫ‌ర్‌.. ప్రతిరోజు 100 మందికి ఛాన్స్‌..!

ఏపీలో చదువుకునే విద్యార్థులకు అసెంబ్లీ సమావేశాలు చూసే అవకాశం క‌ల్పించారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. ప్రతిరోజు 100 మంది విద్యార్ధుల‌కు ఈ అవకాశం కల్పించ‌నున్న‌ట్లు తెలిపారు. గత మూడు రోజులుగా వివిధ కాలేజీల నుండి వ‌చ్చిన‌ విద్యార్థులు అసెంబ్లీ సమావేశాలు వీక్షించారు. నాల్గవ రోజు అసెంబ్లీ సమావేశంలో భాగంగా రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థిని విద్యార్థులు సుమారు 100 మంది సమావేశాలు ప్ర‌త్య‌క్షంగా వీక్షించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. ప్ర‌త్య‌క్షంగా అసెంబ్లీ సమావేశాలు వీక్షించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. టీవీలలో చూడటం తప్ప స్వయంగా అసెంబ్లీకి వచ్చి ప్ర‌త్య‌క్షంగా సమావేశాలు చూడ‌టం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ అవకాశాన్ని కల్పించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడుకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.


Next Story