పవన్ కళ్యాణ్ తో సినిమా తీస్తా అంటున్న ఏపీ మంత్రి

AP Minister who wants to make a film with Pawan Kalyan. ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ జనసేనాని పవన్ కళ్యాణ్ పై మరోసారి విమర్శలు గుప్పించారు

By Medi Samrat
Published on : 3 Jan 2023 6:31 PM IST

పవన్ కళ్యాణ్ తో సినిమా తీస్తా అంటున్న ఏపీ మంత్రి

ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ జనసేనాని పవన్ కళ్యాణ్ పై మరోసారి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని 175 నియోజవర్గాల పేర్లు కూడా తెలియని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అన్నారు. ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారా అని ప్రశ్నించారు. పవన్ సినిమాల్లోనే పవర్ స్టార్ రాజకీయాల్లో ప్యాకేజీ స్టార్ అంటూ విమర్శలు చేశారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ జీవితంలో సీఎం కాలేడని, కనీసం 'సీఎం పవన్ కళ్యాణ్' అని సినిమా తీస్తే అభిమానులు చూసి సంతోషిస్తారని అన్నారు. ఒకవేళ అవసరమైతే ఆ సినిమాకు తానే ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తానని మంత్రి అమర్నాథ్ అన్నారు.

పవన్ క‌ళ్యాణ్‌ ఎప్పుడూ ఇతరుల కోసం తన పార్టీని ఉపయోగిస్తుంటారని.. 2014 లో చంద్రబాబును గెలిపించాలని భావించి పోటీ చేయలేదని, 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల కోసం బరిలో దిగి ఓడిపోయారని అన్నారు. కనీసం 2024లో అయినా పవన్ 175 సీట్లలో పోటీ చేస్తానని చెప్పగలరా? అంటూ అమర్నాథ్ ప్రశ్నించారు. బాబు హయాంలో పెన్షన్‌ రావాలంటే మరొకరు చనిపోవాలి. ఇప్పుడు కొత్తవారికి కూడా పెన్షన్లు ఇస్తుంటే ఎల్లోమీడియా చూడలేకపోతోంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.


Next Story