విశాఖపట్నంలో పేదలకు భూముల కేటాయింపునకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖపట్నంలో 1.85 లక్షల మంది లబ్ధిదారులకు 6000 ఎకరాల భూమిని కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో పేదలకు భూములు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయిజ అయితే కోర్టు అన్ని పిటిషన్లను కొట్టివేసింది. కేటాయింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జగనన్న ఇళ్ల పథకం కింద పేదలకు లబ్ధి చేకూర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం జిల్లాలో మొత్తం 6,116.50 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్‌కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై హైకోర్టు తాజా తీర్పుతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ సాయంత్రం వైఎస్ జగన్ కటౌట్‌కు పాలు పోసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా భూముల కేటాయింపునకు ప్రభుత్వం ఇప్పటికే టోకెన్లు జారీ చేసి హద్దులు కూడా వేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు భూముల కేటాయింపు ప్రక్రియను ముమ్మరం చేసే అవకాశం ఉంది.