ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 3 నుంచి పది రోజుల పాటు దసరా సెలవులు ప్రారంభం అయ్యాయి. గురువారం అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 13 వరకు దసరా సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్టోబరు 14న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. ఈ మేరకు సంబంధిత అధికారులకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలకు వర్తిస్తుంది.
తెలంగాణ ప్రభుత్వం కూడా సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 14 వరకు విద్యార్ధులకు దసరా సెలవులు ఇచ్చారు. అక్టోబర్ 15న స్కూల్స్ తిరిగి తెరవనున్నారు. అక్టోబర్ 1వ తేదీన పాఠశాలల్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ జరగనున్నాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతి సెలవు కాబట్టి రేపు కూడా అధికారిక సెలవు.