నామినేటెడ్ పదవులను భర్తీ చేసిన ప్రభుత్వం..ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పదవులపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది
By Knakam Karthik
నామినేటెడ్ పదవులను భర్తీ చేసిన ప్రభుత్వం..ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పదవులపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పలు కమిటీలకు ఛైర్మన్లను ప్రకటించిన విషయం తెలిసిందే. అందులోభాగంగానే మరో 22 మందిని వివిధ సంస్థలకు ఛైర్మన్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. అందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరన తర్వాత.. పలు దఫాలుగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తూ వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో పలు నామినేటెడ్ పోస్టులను ప్రభుత్వం తాజాగా భర్తీ చేసింది. ఏపీ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్(APCOB) లిమిటిడ్ ఛైర్మన్‌గా టీడీపీ మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు నియమితులయ్యారు. డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గానూ ఆయన బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం(AP Government) ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకాశం జిల్లా కో-ఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్‌గా కామేపల్లి సీతారామయ్య(టీడీపీ), కాకినాడ జిల్లా కో-ఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్‌గా తుమ్మల రామస్వామి(జనసేన), ఏలూరు DCMs(డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్) ఛైర్మన్‌గా చాగంటి మురళీకృష్ణ(జనసేన), ప్రకాశం కసిరెడ్డి శ్యామల(టీడీపీ), కాకినాడ ఛైర్మన్‌గా పిచ్చేటి చంద్రమౌళిని(టీడీపీ) రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.