క్షమాపణలు చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వారు అలా చేశారని..

వైసీపీ బయటకు వెళ్లిపోవడంలో మా తప్పు లేకపోయినా గవర్నర్‌కు ప్రభుత్వం తరపున క్షమాపణలు చెబుతున్నా..అని పవన్ కల్యాణ్‌ పేర్కొన్నారు.

By Knakam Karthik  Published on  25 Feb 2025 5:14 PM IST
Andrapradesh, Ap Assembly, Deputy Cm PawanKalyan, CM Chandrababu, Jagan, Ysrcp,  Tdp, Janasena

క్షమాపణలు చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వారు అలా చేశారని..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ నేతల విధ్వంసం చూస్తే.. వివేకా హత్య గుర్తుకు వచ్చిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. గవర్నర్ ప్రసంగిస్తుంటే వైసీపీ నేతలు అలా ప్రవర్తించవచ్చా అని ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం చర్చలో భాగంగా పవన్ మాట్లాడుతూ.. వైసీపీ నేతలు గొడవలు, బూతులకు పర్యాయ పదంగా మారిపోయారు. ఇలాంటి నేతలను ఇన్ని సంవత్సరాలుగా చంద్రబాబు ఎలా తట్టుకుని నిలబడగలిగారా? అని నిన్నటి ఘటన తర్వాత నాకు అనిపించింది.. అని పవన్ కల్యాణ్ అన్నారు. ఆయనకు హ్యాట్సాఫ్‌.. అలాంటి వారిని ఎదుర్కోవాలంటే ఎంతో ధైర్యం, తెగువ ఉండాలి.

నిన్న సభలో గొడవ చేసిన వైసీపీ నేతలు.. గవర్నర్‌ సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు ఆయన కళ్లలోకి చూడగలిగేవారా? చట్టాలు చేయాల్సిన వారే ఉల్లంఘిస్తే ఎలా? నిన్న సభలో గొడవ జరుగుతుంటే.. వైసీపీ విధ్వంస విధానాలు గుర్తుకు వచ్చాయి. ప్రజా వేదిక కూల్చివేసిన తీరు.. 200 పైగా ఆలయాలు కూల్చివేత, డాక్టర్ సుధాకర్ చనిపోయిన విధానం, జంగారెడ్డిగూడెం కల్తీ సారా మరణాలు, చంద్రబాబును 53 రోజులు జైల్ల పెట్టిన విధానం, అమరావతి రైతులను రక్తం వచ్చేటట్టు కొట్టి, కేసులు పెట్టిన తీరు, తిరుపతి కల్తీ లడ్డూ ఘటనలు గుర్తుకువచ్చాయి. అసెంబ్లీలోనే ఈ స్థాయిలో ప్రవర్తిస్తే. బయట కూడా ఇలాంటి గొడవలే జరుగుతాయి. అని పవన్ కల్యాణ్‌ అన్నారు.

గవర్నర్ గారికి ఆరోగ్యం సరిగా లేకపోయినా.. ఆయన ప్రసంగం ఇచ్చినందుకు ధన్యవాదాలు, కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వారికి ఇబ్బంది పెట్టవద్దని సీఎం చంద్రబాబు చెప్పారు. అయినా వారి వ్యవహార శైలి మారలేదు. నిన్న సభలో నుంచి వైసీపీ బయటకు వెళ్లిపోవడంలో మా తప్పు లేకపోయానా గవర్నర్‌కు ప్రభుత్వం తరపున క్షమాపణలు చెబుతున్నా..అని పవన్ కల్యాణ్‌ పేర్కొన్నారు.

Next Story