Video: సెలూన్ షాప్ ఓపెనింగ్‌కు టీ షర్ట్, షార్ట్‌లో వెళ్లిన ఏపీ డిప్యూటీ సీఎం

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో పర్యటించారు.

By Knakam Karthik
Published on : 8 Jun 2025 4:06 PM IST

Andrapradesh, Krishna District, AP Deputy Cm Pawan Kalyan, Ysrcp, Tdp, Janasena

Video: సెలూన్ షాప్ ఓపెనింగ్‌కు టీ షర్ట్, షార్ట్‌లో వెళ్లిన ఏపీ డిప్యూటీ సీఎం

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో పర్యటించారు. నగరంలో కొత్తగా ఏర్పాటు చేసిన "కొనికి" అనే సెలూన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యుడు యార్లగడ్డ వెంకట్రావు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్, యార్లగడ్డ వెంకట్రావు ఇరువురూ సెలూన్ నిర్వాహకులకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు.

అయితే ఈ కార్యక్రమానికి వచ్చిన పవన్ కల్యాణ్‌ స్టైలిష్ లుక్‌లో కనిపించారు. లేత నీలం రంగు రౌండ్ నెక్ టీషర్ట్, నలుపు రంగు షార్ట్స్‌ ధరించి వచ్చారు. ఆయన క్యాజువల్ లుక్ అందరినీ ఆకట్టుకుంది, ట్రెండీగా కనిపించిందని పలువురు వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Next Story