మోదీ ఓట్ల దొంగ కాబట్టే ఈ మౌనం..షర్మిల సంచలన ట్వీట్
ప్రధాని మోదీ ఓట్ల దొంగ కాబట్టే.. రాహుల్‌గాంధీ బయటపెట్టిన నిప్పులాంటి నిజాలపై సమాధానం చెప్పే దమ్ములేక డిక్లరేషన్ అంటూ వెనకుండి నాటకాలు ఆడిస్తున్నారు..అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు
By Knakam Karthik
మోదీ ఓట్ల దొంగ కాబట్టే ఈ మౌనం..షర్మిల సంచలన ట్వీట్
ప్రధాని మోదీ ఓట్ల దొంగ కాబట్టే.. రాహుల్‌గాంధీ బయటపెట్టిన నిప్పులాంటి నిజాలపై సమాధానం చెప్పే దమ్ములేక డిక్లరేషన్ అంటూ వెనకుండి నాటకాలు ఆడిస్తున్నారు..అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ఈ మేరకు షర్మిల ఆమె ఎక్స్ ఖాతాలో ఇలా రాసుకొచ్చారు.. ప్రజాస్వామ్యానికి పునాది ఓటు హక్కు. సమానత్వం ప్రస్ఫుటంగా కనిపించేది ఒక ఓటు విషయంలోనే. ఒక పూట కూడా తిండి దొరకని పేదవాడికైనా, లక్షల కోట్లు ఉన్న ధనవంతుడికైనా ఓటు దగ్గర సమానమే. రాజ్యాంగం మనకిచ్చిన వజ్రాయుధం లాంటి పవిత్రమైన ఓటు బీజేపీ అధికార దాహానికి దుర్వినియోగం అవుతుంది. దొంగ ఓట్ల చేరికతో వ్యవస్థ భ్రష్టుపట్టింది. దొడ్డిదారిలో బీజేపీ గెలుపు కోసం ఎన్నికల కమిషన్ నే కలుషితం చేశారు. ప్రజాస్వామ్యానికి కాపు కాయాల్సిన EC.. మోదీ గారి కాపు కాస్తోంది. ఎన్నికల కమిషన్ తీరు చూస్తే మేడిపండు చందంగా ఉంది. స్వతంత్ర వ్యవస్థ కాస్త బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారింది. RSS లాంటి అనుబంధ సంస్థల జాబితాలో EC కూడా భాగమైంది. ఇవ్వాళ దేశంలో ఎన్నికల కమిషన్ అంటే "ఎలక్షన్ చోర్ కమిషన్"..అని సంచలన ఆరోపణలు చేశారు.
మోదీ గారికి జీ హుజూర్ అనకపోతే.. రాహుల్ గాంధీ గారు సంధించిన 5 ప్రశ్నలపై ECI వెంటనే సమాధానం చెప్పాలి. డిజిటల్ ఓటర్ జాబితా ఎందుకు ఇవ్వడం లేదు ? CCTV ఆధారాలు ఎందుకు నాశనం చేశారు ? నకిలీ ఓటర్ల జాబితా ఎందుకు తారుమారు అయింది ? ప్రతిపక్ష నేతలను ఎందుకు బెదిరిస్తున్నారు ? బీజేపీకి ఎన్నికల సంఘం ఏజెంట్ గా మారిందా ? ECI స్వతంత్ర వ్యవస్థే అయితే, ప్రజాస్వామ్యం ECకి ముఖ్యం అనుకుంటే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు లేవనెత్తిన సందేహాలకు బదులివ్వాలి. రాహుల్ గాంధీ గారు ప్రారంభించిన ఓట్ చోర్ క్యాంపెయిన్ ను ఆంధ్రప్రదేశ్ లో సైతం కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రతి గడపకు చేరుస్తాం. ఓట్ల దొంగ మోడీ తీరును, బీజేపీ కోసం అధికార దుర్వినియోగం చేసిన ఎన్నికల కమిషన్ వైఖరిని ఎండగడతాం...అని షర్మిల ట్వీట్ చేశారు.
ప్రజాస్వామ్యానికి పునాది ఓటు హక్కు. సమానత్వం ప్రస్ఫుటంగా కనిపించేది ఒక ఓటు విషయంలోనే. ఒక పూట కూడా తిండి దొరకని పేదవాడికైనా, లక్షల కోట్లు ఉన్న ధనవంతుడికైనా ఓటు దగ్గర సమానమే. రాజ్యాంగం మనకిచ్చిన వజ్రాయుధం లాంటి పవిత్రమైన ఓటు బీజేపీ అధికార దాహానికి దుర్వినియోగం అవుతుంది. దొంగ ఓట్ల… pic.twitter.com/xXwO4htyZ0
— YS Sharmila (@realyssharmila) August 11, 2025