ఆయన మూర్ఖుడిలా మాట్లాడారు, వైసీపీ మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తోంది: షర్మిల

వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు.

By Knakam Karthik
Published on : 10 Jun 2025 3:40 PM IST

Andrapradesh, Ys Sharmila, Congress, Ys Jagan, Ysrcp, Ap Government, Tdp

ఆయన మూర్ఖుడిలా మాట్లాడారు, వైసీపీ మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తోంది: షర్మిల

అమరావతి రాజధాని మహిళలపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. అన్నమయ్య జిల్లాలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మహిళలను కించపరుస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి ఒక మూర్ఖుడిలా మాట్లాడారు. మహిళలను పిశాచులతో పోల్చుతూ, రాక్షసులు అంటారా? సంకర జాతి అని అవమానిస్తారా? చేసిన తప్పుకి క్షమాపణ చెప్పడానికి మీకెందుకు నామోషీ? వైసీపీ చేసిన తప్పునే మళ్లీ మళ్లీ చేస్తుంది. సజ్జల కుమారుడు భార్గవ్‌రెడ్డి సోషల్‌మీడియాను అడ్డుపెట్టుకొని నాపై కూడా దుష్ప్రచారం చేశారు. వైఎస్‌ కుమార్తె, ఒక మహిళ అని కూడా చూడకుండా కించపరిచారు. జగన్‌ అందరినీ నా అక్కాచెల్లెళ్లు అంటారు.. కానీ, ఆయన సొంత చెల్లికే మర్యాద లేదు. ఇక రాష్ట్రంలోని మహిళలను ఏం గౌరవిస్తారు?.. అని షర్మిల విమర్శించారు.

ఈ క్రమంలోనే పార్టీలో కొందరి తీరుపై షర్మిల అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ మహా సముద్రమని.. అందులో మంచితోపాటు చెత్త కూడా ఉంటుందన్నారు. పార్టీ అభివృద్ధి చెందుతుంటే కిందకి లాగేవాళ్లు ఉన్నారు. వారే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు. పార్టీకి క్రమశిక్షణ కమిటీ ఉంది. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటాం. సొంతపార్టీపై దుష్ప్రచారం చేస్తే ఊరుకునేది లేదు.. అని వైఎస్ షర్మిల వార్నింగ్ ఇచ్చారు.

Next Story