పూర్వోదయ, సాస్కీ పథకాల ద్వారా ఏపీకి చేయూత ఇవ్వండి..నిర్మలా సీతారామన్‌కు సీఎం రిక్వెస్ట్

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో సమావేశం అయ్యారు.

By -  Knakam Karthik
Published on : 19 Dec 2025 1:30 PM IST

Andrapradesh, Cm Chandrababu, Union Finance Minister Nirmala Sitharaman, Ap Government, Central Government

పూర్వోదయ, సాస్కీ పథకాల ద్వారా ఏపీకి చేయూత ఇవ్వండి..నిర్మలా సీతారామన్‌కు సీఎం రిక్వెస్ట్

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో సమావేశం అయ్యారు. పూర్వోదయ, సాస్కీ పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు చేయూత ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దేందుకు వచ్చే బడ్జెట్ లో నిధులు కేటాయించాలని కోరారు. కరవు పీడిత ప్రాంతాల దాహార్తిని తీర్చేందుకు, సాగునీటి అవసరాల కోసం గోదావరి వరద జలాల మళ్లింపు కోసం చేపట్టే పోలవరం- నల్లమల సాగర్ ప్రాజెక్టుకు చేయూత అందించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.

పూర్వోదయతో గ్రోత్ ఇంజన్ గా ఏపీ

దేశంలోని తూర్పు ప్రాంత రాష్ట్రాల సమగ్ర అభివృద్ధికి తోడ్పడే పూర్వోదయ పథకం వికసిత్ భారత లక్ష్యాన్ని చేరుకునేందుకు, జాతీయ ఆర్ధిక వ్యవస్థకు చోదకశక్తిగా నిలుస్తుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల కనెక్టివిటీ, సాగునీటి పారుదల వ్యవస్థల ఆధునీకరణ, మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామిక కారిడార్లు, ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ల నిర్మాణం, విద్య వైద్య రంగాల సదుపాయాల కల్పన కోసం పూర్వోదయ పథకం కీలకంగా మారుతుందని పేర్కొన్నారు. తద్వారా ఆయా గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన ఆర్దిక అవకాశాలను అందిస్తుందని స్పష్టం చేశారు. విద్య, నైపుణ్యాకల్పన, వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, హౌసింగ్, రహదారులు, సాగునీటి ప్రాజెక్టుల లాంటి కీలకమైన రంగాల్లో పూర్వోదయ నిధులు అందించి ఏపీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ పథకం కింద ప్రాధాన్యతా క్రమంలో చేపట్టే ప్రాజెక్టులకు పాలనాపరమైన నిబంధనల్ని సరళీకృతం చేయాలని ..రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా వీటిని వినియోగించుకునేలా వెసులుబాటు ఇవ్వాలని సీఎం కోరారు.

సాస్కీతో ఏపీకి చేయూత

సాస్కీ కింద మంజూరైన వివిధ ప్రాజెక్టులను సత్వరం చేపట్టాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. విశాఖలో యూనిటీమాల్ నిర్మాణం, అఖండ గోదావరి కింద చేపట్టిన హావ్ లాక్ బ్రిడ్జి పునర్నిర్మాణ పనులు, గండికోట పర్యాటక ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలో మూడు వర్కింగ్ విమెన్ హాస్టళ్ల నిర్మాణాల పూర్తికి నిధులివ్వాలని కోరారు. సాస్కీకింద రెండో విడత నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. తీవ్ర ఆర్ధిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో మౌలిక సదుపాయాల నిర్మాణానికి సాస్కీ పథకం కింద నిధులు కీలమని పేర్కొన్నారు. వీటితో పాటు సాగునీటి ప్రాజెక్టలు, రాష్ట్ర, జిల్లా రహదారుల నిర్మాణం, ఎంఎస్ఎంఈ పార్కులు, హౌసింగ్, వైద్యారోగ్య మౌలిక సదుపాయాల కల్పనకు అదనపు నిధులు మంజూరు చేయాలని కోరారు. 2025-26 ఆర్ధిక సంవత్సరంలో ఈ పనులకు గానూ రూ.10,054 కోట్లు సాస్కీ కింద మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కోరారు.

Next Story