అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు సచివాలయంలో ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలో సీఆర్డీఏ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. సీఆర్డీఏ పరిధిలో అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు, రూ.904 కోట్లతో రాజధాని గ్రామాల్లో అభివృద్ధి పనులు, మౌలిక వసతులు కల్పనకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కొన్ని సంస్థలకు భూ కేటాయింపునకు సంబంధించి కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. కాగా కేబినెట్ సమావేశం తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించే అవకాశం ఉంది.