అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఈ సందర్భంగా రాజధానిలో పలు ప్రాజెక్టులకు ఎస్‌పీవీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అర్బన్ డిజైన్లు, ఆర్కిటెక్చరల్ గైడ్‌లైన్స్ నోటిఫికేషన్‌కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. కన్వెన్షన్ సెంటర్లకు సంబంధించి భూ కేటాయింపులకు ఆమోదం తెలపనుంది.
కాగా రాజధాని ల్యాండ్ పూలింగ్‌కు ఇవ్వని వాటిపై భూ సేకరణ ద్వారా తీసుకునేందుకు సీఆర్డీఏకు కేబినెట్ అనుమతి ఇవ్వనుంది. ఏరో స్పేస్, ఐటీ, ఇంధనం, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఎస్‌ఎంఈ రంగాల్లో పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. రూ.53,922 కోట్ల మేర పెట్టుబడులకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. ఈ ప్రాజెక్టులతో 83,437 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. అటు బిజినెస్ సెంటర్ల తరహాలో పారిశ్రామిక పార్కులతో ఎకో సిస్టమ్‌కు అనుమతి కోసం కేబినెట్ ఆమోదం తెలపనుంది. కాగా ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిపే అంశంపై కూడా కేబినెట్ భేటీలో చర్చించనున్నట్లు సమాచారం. అటు అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులపై కూడా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.