బ్రిటీష్ వారు, వైసీపీ నాయకులు ఒక్క‌టే : సోమువీర్రాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

AP BJP Cheif Somu Veerraju Comments On YSRCP. ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బ్రిటీష్ వారు వైసీపీ నాయకులు

By Medi Samrat  Published on  28 July 2021 2:10 PM IST
బ్రిటీష్ వారు, వైసీపీ నాయకులు ఒక్క‌టే : సోమువీర్రాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బ్రిటీష్ వారు వైసీపీ నాయకులు ఒక్కటేన‌ని వ్యాఖ్యానించారు. అప్పుడు బ్రిటిష్ వారు గోమాతను చులకన చేస్తే.. ఇప్పుడు అధికార పార్టీ నాయకుడు కూనీ చేస్తున్నాడని ఆరోపించారు. భారతీయులు పవిత్రంగా భావించే గోమాతపై వైసీపీ నాయకుల ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. సీఎం జ‌గ‌న్‌ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని.. వైసీపీ ప్రజావ్యతిరేక పాలనను బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చ‌రించారు.

రాష్ట్రంలో వైసీపీని దీటుగా ఎదుర్కొనే పార్టీ బీజేపీనేన‌ని.. ఎస్టీలపై దాడులు చేసి మతం మారాలని వత్తిడి చేస్తున్నారని సోము వీర్రాజు అన్నారు. హిందువుల మనోభావాలకు అద్దం పట్టే పార్టీ బీజేపీ అని తెలిపారు. వైసీపీ నేతలు గోమాతపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, ఎస్టీలపైన‌ దాడులపై ఈ ప్రభుత్యం వెంటనే చర్యలు చేపట్టాలని.. లేకపోతే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చ‌రించారు. వైసీపీ నవరత్నాలు ఇస్తే.. బీజేపీ 100 రత్నాలు ఇస్తుందని.. నవరత్నాలు కోసం అప్పు చేసి పప్పు కూడు పెడుతుంద‌ని అధికార‌ పార్టీపై ఫైర్ అయ్యారు.


Next Story