ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్సయింది. ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. మూడు వారాల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి రోజు బీఏసీ సమావేశం తర్వాత సభ ఎన్ని రోజులు జరపాలనే అంశంపై నిర్ణయం ప్రకటించనుంది. అసెంబ్లీ సమావేశాలకు రాష్ట్ర మంత్రులు పూర్తిస్థాయిలో సబ్జెక్టుతో హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ నెల 28వ తేదీన రాష్ట్ర అసెంబ్లీలో ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెడతారు. అంతకు ముందు ప్రభుత్వం ఓట్ ఆన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. దాదాపు 10 నెలల తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టడానికి సిద్ధమవుతోంది.