ఏపీలో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఫైనల్..లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారంటే?

ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది.

By Knakam Karthik  Published on  9 March 2025 7:53 PM IST
Andrapradesh, TDP MLC Candidates, Janasena, Bjp, CM Chandrababu

ఏపీలో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఫైనల్..లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారంటే?

ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది. కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడుకు ఎమ్మెల్సీ టికెట్లు కేటాయించింది. 5 స్థానాలకు గాను ఇప్పటికే ఒకటి జనసేనకు ఇవ్వగా, మరొకటి బీజేపీకి కేటాయించనుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తే కావలి గ్రీష్మ.

సామాజిక వర్గాల వారీగా ముగ్గురు నాయకులకు అవకాశం కల్పించింది. ఎస్సీ మాల సామాజిక వర్గం నాయకురాలు, మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె కావలి గీష్మ కాగా, యాద సామాజిక వర్గానికి చెందిన నేత బీద రవిచంద్రతో పాటు బోయ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు బీటీ నాయుడును తమ అభ్యర్థులుగా టీడీపీ అధిష్టానం వెల్లడించింది.

అయితే ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో జనసేన నుంచి నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. ముగ్గురు టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. అయితే మరో ఎమ్మెల్సీ స్థానంపై ఉత్కంఠ నెలకొంది. ఈ స్థానాన్ని బీజేపీ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు.

Next Story