Andhrapradesh: అకౌంట్లలోకి డబ్బులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2024 - 25 విద్యా సంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను నేరుగా కాలేజీలకే జమ చేస్తామని వెల్లడించింది.

By అంజి  Published on  21 Nov 2024 7:51 AM IST
Andhrapradesh, AP Govt, Fee Reimbursement, Students

Andhrapradesh: అకౌంట్లలోకి డబ్బులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2024 - 25 విద్యా సంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను నేరుగా కాలేజీలకే జమ చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచే దీనిని అమలు చేస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ తెలిపింది. ఎస్సీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నుంచి 60 శాతం వాటా రావాల్సి ఉన్నందున వారికి మినహా మిగతా విద్యార్థుల ఫీజులను కాలేజీలకు జమ చేయనుంది.

విద్యార్థుల హాజరు ఆధారంగా ఫీజులు విడుదల అవుతాయని వెల్లడించింది. ఫీజుల అంశంపై త్వరలో మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. ఇప్పటి వరకు ఏటా 3 నుంచి 4 విడతల్లో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఫీజు డబ్బులు జమ అయ్యేవి. కొంతమంది విద్యార్థులు ఈ విధానంతో ఇబ్బందిపడ్డారనే విమర్శలు వచ్చాయి. కోర్సులు పూర్తిచేసుకున్న విద్యార్థులు ఫీజులు కట్టకపోతే సర్టిఫికెట్లు ఇవ్వకుండా కాలేజీలు ఇబ్బంది పెట్టాయి. దీంతో చాలామంది విద్యార్థులు అప్పులు చేసి ఫీజులు కట్టి సర్టిఫికెట్లు తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఆ నిర్ణయానికి కూటమి ప్రభుత్వం స్వస్తి పలికింది.

Next Story