ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు.. రేపు దేశ రాజధాని ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో వైఎస్ జగన్ భేటీ కానున్నారు. ఈ భేటీలో మూడు రాజధానుల అంశం, పోలవరం ప్రాజెక్టు రివైజ్డ్‌ఎస్టిమేషన్ నిధులు, అమరావతి అభివృద్ధి కార్యాచరణ అంశాలపై చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన హామీలు నేరవేర్చాలని ప్రధాని మోడీని కోరనున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర సమస్యలపై ప్రధాని మోడీకి ముఖ్యమంత్రి జగన్ వినతిపత్రం ఇవ్వనున్నారు. వివిధ పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు. అలాగే ఈ పర్యటనలో వైఎస్ జగన్ కేంద్రహోంశాఖమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర పెద్దలను కలిసి ఛాన్స్ ఉంది. ఇటీవల రాష్ట్ర బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు, వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ ఆసక్తికరంగా మారింది.