ఆంధ్రా యునివర్సిటీలో.. తాళపత్ర గ్రంథాల డిజిటలైజేషన్ ప్రారంభం
Andhra University begins digitization of palm-leaf manuscripts. ఆంధ్రా యూనివర్సిటీ వర్సిటీ లైబ్రరీలో అందుబాటులో ఉన్న తాళపత్ర పుస్తకాల మొత్తాన్ని డిజిటలైజేషన్ చేసే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం
By అంజి Published on 30 Dec 2021 11:45 AM IST
ఆంధ్రా యూనివర్సిటీ వర్సిటీ లైబ్రరీలో అందుబాటులో ఉన్న తాళపత్ర పుస్తకాల మొత్తాన్ని డిజిటలైజేషన్ చేసే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కథలు, కవితలు, శాస్త్రాలు, పురాణాలను భావి తరాలకు అందించాలనే ఉద్దేశంతో డిజిటలైజేషన్ నిర్ణయం తీసుకున్నారు. "ఆంధ్రా విశ్వవిద్యాలయం దాని విఎస్ కృష్ణ లైబ్రరీలో తాళపత్ర మాన్యుస్క్రిప్ట్‌ల డిజిటలైజేషన్‌ను ప్రారంభించింది. లేఖనాల కంటెంట్‌ను డిజిటల్ ఫార్మాట్‌లో అందుబాటులో ఉంచడానికి మేము ఈ కసరత్తును చేపట్టాము. ఇది యువ పరిశోధకులకు శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతుంది" అని ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి అన్నారు. వర్సిటీ పరిధిలోని వీఎస్ కృష్ణా గ్రంథాలయంలో డిజిటలైజేషన్ కార్యక్రమం జరుగుతోంది.
వర్సిటీ నుండి వచ్చిన సమాచారం ప్రకారం.. ప్రారంభ రోజుల్లో తాళపత్ర పుస్తకాలపై కథలు, పద్యాలు, శాస్త్రాలు, పురాణాలు మొదలైనవి వ్రాయబడ్డాయి. తాళపత్ర గ్రంథాలలో అపూర్వమైన జ్ఞాన సంపద ఉంది. తాళపత్ర గ్రంథాలు భారతదేశానికి విలువైన జాతీయ సంపద అని పండితులు చెప్పారు. ఆంధ్రా యూనివర్సిటీలో కూడా వేల సంఖ్యలో తాళపత్ర పుస్తకాలు ఉన్నాయి. ఆంధ్రవా యూనివర్సిటీలోని వీఎస్ కృష్ణ లైబ్రరీలో ఇప్పుడు అనేక రంగాలకు సంబంధించిన ఐదు లక్షల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు ఎన్నో విలువైన, అరుదైన తాళపత్ర రాత ప్రతులు కూడా ఉన్నాయి. వీటిని ప్రత్యేక విభాగంలో భద్రపరిచి పరిరక్షించడంతోపాటు నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
వందల ఏళ్ల నాటి తాళపత్ర గ్రంథాలను భద్రపరిచేందుకు 90 ఏళ్ల క్రితం ఏయూలో తాళపత్ర గ్రంథాలయ విభాగం పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం 2,663 తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. అప్పట్లో బొబ్బిలి సంస్థానం 220, విశాఖపట్నం ఎంబార్‌కు చెందిన ఆర్ష గ్రంథాలయ ప్రతినిధి 1,368, తుమ్మపాల నుంచి ఇమాని వెంకటేశ్వర్లు 119, నందిపల్లికి చెందిన నిష్టల రమణయ్య 66, గవరవరం తాళపత్రాల పుస్తకాలు అన్నపూర్ణయ్య 40 చొప్పున విరాళంగా అందజేశారు. వర్సిటీ వివిధ ప్రాంతాల నుండి కొన్ని తాళపత్ర మాన్యుస్క్రిప్ట్‌లను కూడా కొనుగోలు చేసింది" అని ఒక అధికారి తెలిపారు.