మరో ఆసక్తికరమైన ట్వీట్ చేసిన ఆనంద్ మహీంద్రా..!

Anand Mahindra Another Interesting Tweet Goes Viral. ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ట్వీట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

By Medi Samrat
Published on : 4 April 2022 11:47 AM IST

మరో ఆసక్తికరమైన ట్వీట్ చేసిన ఆనంద్ మహీంద్రా..!

ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ట్వీట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు చూసినా ఏదో ఒక ఆసక్తికరమైన సంఘటనలకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా కూడా ఆనంద్ మహీంద్రా ఓ ట్వీట్ చేశారు. అందులో ఓ మహిళ, ఓ వ్యక్తి కలిసి స్కూటర్ పై వెళుతున్నట్లు చూడవచ్చు. మొత్తం చైర్స్ వేసుకుని.. చాపలు కూడా తీసుకొని వెళుతున్నారు. అంతేకాకుండా ఆమె కాస్త ఇరుకుగా స్కూటర్ పై కూర్చుంది.

ఆనంద్ మహీంద్రా తాజాగా భారతదేశంలో ద్విచక్ర వాహనాలకు ఉన్న ఆదరణ గురించి మాట్లాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహనాల ఉత్పత్తిదారుల్లో భారతదేశం ఒకటిగా పేరుగాంచింది. ఆయన ట్వీట్ లో ఓ పురుషుడు, ఓ మహిళ మోటార్‌బైక్‌పై వెళ్తున్న ఫొటోను ట్వీట్‌ చేశాడు. ద్విచక్రవాహనంపై కుర్చీలు, చాపలు తీసుకుని వెళ్లారు. అంత సరుకుతో ద్విచక్రవాహనాన్ని లోడ్ చేయడం అసాధ్యం అనిపించినప్పటికీ, ఎంతో సులభంగా చేశారు. మహీంద్రా మాట్లాడుతూ "భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక ద్విచక్ర వాహనాలను ఎందుకు తయారు చేస్తుందో ఇప్పుడు మీకు అర్థం అవుతుంది. ప్రతి చదరపు అంగుళంలో ఎక్కువగా సరుకును ఎలా తీసుకువెళ్లాలో మాకు తెలుసు.. మేము అలాంటి వాళ్లమే." అంటూ ట్వీట్ లో చెప్పుకొచ్చారు.

Next Story