జ‌న‌సేనాని మద్దతు కోరిన రాజధాని రైతుల‌ ప్రతినిధులు

Amravati Farmers Mahapadayatra From November 1st. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని పరిరక్షించాలని కోరుతూ నవంబర్ 1వ తేదీ నుంచి

By Medi Samrat  Published on  22 Oct 2021 7:06 PM IST
జ‌న‌సేనాని మద్దతు కోరిన రాజధాని రైతుల‌ ప్రతినిధులు

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని పరిరక్షించాలని కోరుతూ నవంబర్ 1వ తేదీ నుంచి రైతులు మహా పాదయాత్ర నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మహా పాదయాత్రకు పలువురి మద్దతును రైతులు కోరుతున్నారు. మహా పాదయాత్రకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతును రాజధాని రైతుల‌ ప్రతినిధులు కోరారు. ఈ మేర‌కు శుక్రవారం ఉదయం జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్‌ను అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ స‌మితి, రాజ‌ధాని ఐక్య కార్యాచ‌ర‌ణ స‌మితి ప్ర‌తినిధులు క‌లిశారు.

ఈ మహా పాదయాత్ర తుళ్ళూరు గ్రామం నుంచి తిరుమల వరకు 45 రోజులపాటు సాగనుంది. డిసెంబర్ 17వ తేదీతో పాదయాత్ర ముగియనుంది. దాదాపు రెండేళ్లుగా దీక్షలు చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. అమరావతి పరిరక్షణలో భాగంగా మహా పాదయాత్ర తలపెట్టినట్లు రైతులు చెప్పారు. రాజధాని కోసం మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్‌కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. పవన్ కళ్యాణ్, మనోహర్‌లు మహా పాదయాత్రకు మద్దతు ఇవ్వాలని రైతులు, జేఏసీ నేతలలు విజ్ఞప్తి చేసారు. రైతుల మహా పాదయాత్ర విజయవంతం కావాలని మనోహర్ ఆకాంక్షించారు.


Next Story