వచ్చే ఎన్నికలపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు క్లారిటీ లేదని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. పొత్తులపై పవన్ కల్యాణ్ మూడు ఆప్షన్‌లు పెట్టుకోవడం సరికాదని అంబటి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేయడమే పవన్ కళ్యాణ్ లక్ష్యమా అని అంబటి ఆదివారం ప్రశ్నించారు. పవన్ ఆశయం ఏమిటో కనీసం అభిమానులకైనా చెబితే బాగుంటుందని అంబటి అన్నారు. తమ ప్రభుత్వం ప్రజలకు, రైతులకు జవాబుదారీగా ఉంటుందని, వీలైనంత త్వరగా పోలవరాన్ని పూర్తి చేస్తామని చెప్పారు.
తాము చిత్తశుద్ధితో పని చేస్తున్నామని.. దశలవారీగా పోలవరం పూర్తి చేస్తామని అంబటి రాంబాబు అన్నారు. ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని మంత్రి ఆరోపించారు. ''ప్రభుత్వంపై 60 శాతానికి పైగా ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి చంద్రబాబే కారణం.. కాఫర్ డ్యామ్ పూర్తికాకముందే డయాఫ్రమ్ వాల్ మూతపడింది. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎమ్‌గా వాడుకున్నారన్న ప్రధాని మాటలను మంత్రి అంబటి గుర్తు చేశారు.