పవన్ కళ్యాణ్‌పై విమర్శలు గుప్పించిన అంబటి

Ambati Rambabu Fire On Pawan Kalyan. సత్తెనపల్లిలో కౌలు రైతు భరోసా యాత్రలో పవన్‌ కళ్యాణ్ మాట్లాడుతూ..

By Medi Samrat  Published on  18 Dec 2022 6:00 PM IST
పవన్ కళ్యాణ్‌పై విమర్శలు గుప్పించిన అంబటి

సత్తెనపల్లిలో కౌలు రైతు భరోసా యాత్రలో పవన్‌ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఎన్నికల రథం వారాహిని ఆపి చూడండి.. నేనేంటో చూపిస్తా అంటూ సవాల్‌ విసిరిన సంగతి తెలిసిందే..! "నేను నా వారాహి వాహనంలో ఆంధ్రప్రదేశ్ రోడ్లపై తిరుగుతాను. ఎవరు ఆపుతారో నేనూ చూస్తాను. మీ ముఖ్యమంత్రిని రమ్మను... ఈ కూసే గాడిదలను రమ్మను.... నా వారాహిని ఆపండి... నేనేంటో అప్పుడు చూపిస్తా" అంటూ వ్యాఖ్యలు చేశారు పవన్.

ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేత అంబటి రాంబాబు ట్విట్టర్ లో వెంటనే స్పందించారు. మేము కాదు గాడిదలం... బాబును మోసే నువ్వే పెద్ద అడ్డగాడిదవి పవన్ కళ్యాణ్ అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు.

అంతకు ముందు పవన్ కళ్యాణ్ ను అసలు రాజకీయ నేతగా చూడట్లేదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆయన పర్యటన, యాత్ర కారణంగా భయపడాల్సిన అవసరం తమకులేదని మంత్రి స్పష్టం చేశారు. వేరే ఎవరి కోసమో పనిచేసే వీకెండ్ లీడర్ పవన్ కళ్యాణ్ అని ఆరోపించారు.


Next Story