జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పటంలో కూల్చివేతల బాధితులకు ఒక్కొక్కరికీ జనసేన తరఫున రూ.లక్ష చొప్పున పరిహారం చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తనకు అండగా ఉన్న ఇప్పటం గ్రామస్థులకు తాను అండగా ఉంటానని.. ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతలో పద్ధతి పాటించలేదని.. పరిహారం ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేయడం తనను బాధించిందని అన్నారు. మరోసారి వైసీపీ మీదా.. వైసీపీ నాయకుల మీదా.. విరుచుకుపడ్డారు పవన్ కళ్యాణ్. జనసేనాని వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఏమీ లేని ఆకు ఎగిరెగిరిపడుతుందని, పవన్ బాబు కూడా అంతేనంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు- పవన్ కల్యాణ్‌ల గుట్టు హైకోర్టు తీర్పుతో రట్టు అయిందని అన్నారు. హైకోర్టు స్వయంగా జోక్యం చేసుకుని, తప్పుడు పిటీషన్లు వేసిన వారిపై 14 లక్షల రూపాయల జరిమానా విధించడం అంటే మామూలు విషయం కాదని అన్నారు. ఆక్రమణలను తొలగించడమే నేరంగా భావించిన వారిద్దరికీ హైకోర్టు తీర్పు చెంప పెట్టులాంటిదని అన్నారు.