ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక, సాంస్కృతిక సమితి క్రియేటివ్ హెడ్ గా సినీ నటుడు, దర్శకుడు, వ్యాఖ్యాత ఎల్ జోగి నాయుడు బుధవారం బాధ్యతలు చేపట్టారు. వెలగపూడి ఆంధ్రప్రదేశ్ సచివాలయం నాల్గో బ్లాక్ లోని రాష్ట్ర యువజనాభివృద్ది, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.రజత్ భార్గవ చాంబరులో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం బాధ్యతలను చేపట్టారు. రాష్ట్రంలో సాంస్కృతిక పురోగతి, తెలుగు భాషాభివృద్ది, పద్య, ఆధునిక నాటక వికాసం, జానపద కళారూపాల అభివృద్ది, ఆధునీకరణ తదితర కార్యక్రమాలను వ్యూహాత్మకంగా నిర్వహించేందుకై రాష్ట్ర సృజనాత్మక, సాంస్కృతిక సమితి క్రియేటివ్ హెడ్ గా ఎల్.జోగినాయుడు ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 17న జీఓ నెం 46 ను జారీచేసింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డి. వాసుదేవరెడ్డి పాల్గొన్నారు.