అమరావతి: ఆంధప్రదేశ్‌లో యూరియా కోసం అవస్థలు పడుతోన్న రైతులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు శుభవార్త అందించారు. రాష్ట్రానికి 24,894 మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు చొరవ ఫలితంగా ఈ యూరియా కేటాయింపు జరిగింది అని స్పష్టం చేశారు. కాగా ఈ నెల 15వ తేదీ నుంచి 22వ తేదీ లోపు విశాఖపట్నం పోర్టుకు యూరియా చేరుకోనుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
కాగా రైతుల అవసరాలకు కూటమి ప్రభుత్వ ప్రాధాన్యతను ఇస్తుందని, వైసీపీ హయాంలో ఎరువుల కొరత కారణంగా రైతులు ఆందోళనలు చేశారని..అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రైతు కష్టాన్ని ఏకైక నాయకుడు చంద్రబాబు అని.. రైతు సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యం..అని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.