ఏపీ క‌రోనా బులిటెన్‌.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..

132 new corona cases reported in ap. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో క‌రోనా మహమ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 29,228 పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 132

By అంజి  Published on  14 Dec 2021 5:38 PM IST
ఏపీ క‌రోనా బులిటెన్‌.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో క‌రోనా మహమ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 29,228 పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 132 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన‌ట్లు మంగళవారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,72,213కి చేరింది. క‌రోనా వ‌ల్ల కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14468గా ఉంది.

గడిచిన 24 గంటల వ్యవధిలో 186 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,55,922కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,823 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,08,27,634 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. గుంటూరు, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, విశాఖపట్నంలో కరోనా కేసులు పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు దేశంలో ఓమిక్రాన్‌ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 40కిపై చిలుకు ఓమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. ఓమిక్రాన్‌ వేరియంట్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి.

Next Story