రాజంపేట వరద బీభత్సం.. 12 మంది మృతి

12 Dead In Rajampeta Floods. కడప జిల్లా రాజంపేటలో భారీ ప్రాణ నష్టం సంభవించింది. భారీ వర్షాలు, వరదల కారణంగా

By Medi Samrat
Published on : 19 Nov 2021 8:23 PM IST

రాజంపేట వరద బీభత్సం.. 12 మంది మృతి

కడప జిల్లా రాజంపేటలో భారీ ప్రాణ నష్టం సంభవించింది. భారీ వర్షాలు, వరదల కారణంగా బ‌స్సుల‌లో ప్ర‌యాణిస్తున్న‌ దాదాపు 30 మంది వరదనీటిలో కొట్టుకు పోగా.. ఇప్పటి వరకు 12 మృతదేహాలు వెలికితీసిన‌ట్లు తెలుస్తోంది. వ‌ర‌ద ప్ర‌వాహానికి జిల్లాలోని అన్న‌మ‌య్య జ‌లాశ‌యం మ‌ట్టిక‌ట్ట కొట్టుకుపోవ‌డంతో.. చెయ్యేరు నది నుంచి పెద్ద ఎత్తున నందలూరు, రాజంపేట తదితర ప్రాంతాల్లోకి వరద పోటెత్తింది. దీంతో చెయ్యేరు పరిసరాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వ‌ర‌ద ప్ర‌వాహానికి మండ‌పల్లి, ఆకేపాడు, నందలూరు ప్రాంతంలో మూడు ఆర్టీసీ బస్సులు వరదనీటిలో చిక్కుకున్నాయని.. సుమారు 30 మంది చెయ్యేరు వరద ఉద్ధృతిలో కొట్టుకుపోయినట్లు స్థానికులు తెలిపారు.

సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నందలూరు వద్ద ఆర్టీసీ బస్సులో మూడు మృతదేహాలను వెలికితీశారు. గండ్లూరు శివాలయం సమీపంలో ఏడు మృతదేహాలు, రాయవరంలో మూడు మృతదేహాలు వెలికితీశారు. 30మంది వరద ఉద్ధృతిలో కొట్టుకుపోయినట్లు అధికారులు చెబుతున్నా.. స్థానికులు మాత్రం ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. దీంతో మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశ‌ముందని తెలుస్తోంది.


Next Story