మంత్రి 'స‌త్య'కు సీఎం చంద్ర‌బాబు కితాబు

వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌కు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కితాబిచ్చారు.

By -  Medi Samrat
Published on : 23 Sept 2025 9:20 PM IST

మంత్రి స‌త్యకు సీఎం చంద్ర‌బాబు కితాబు

వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌కు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కితాబిచ్చారు. మంగ‌ళ‌వారం సాయంత్రం శాస‌న స‌భ‌లో సిఎం మాట్లాడారు. " వైద్యారోగ్య మంత్రి ' స‌త్య‌ ' బాగా ప‌నిచేస్తున్నారు... చాలా క‌ష్ట‌ప‌డుతున్నారు... త‌న శాఖ‌ను బాగా అవ‌గ‌తం చేసుకున్నారు... ఐ యామ్ వెరీ హ్యాపీ " అని సిఎం అన్నారు.

ఇదిలావుంటే.. శాసనసభలో మంగళవారం వైద్యారోగ్య శాఖపై చర్చ సందర్భంగా పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం అంశాన్ని సీఎం ప్రస్తావించారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం రెండేళ్లల్లో పూర్తి అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణంలోని వాస్తవాలను సభ ముందు ఉంచారు. ప్ర‌తిప‌క్షం అసత్య ప్రచారం చేస్తుంద‌ని అసెంబ్లీ వేదిక‌గా ఎండ‌గ‌ట్టారు. కాలేజీల నిర్మాణం, సీట్ల సంఖ్య, పేదలకు వైద్య సదుపాయాలు వంటి అంశాలను లెక్కలతో సహా వివరించారు. పీపీపీ మెడికల్ కాలేజీల నిర్మాణంపై సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

Next Story