తొలగిన అడ్డంకులు.. విడుదల ఎప్పుడంటే..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 7 Dec 2019 9:33 PM ISTహైదరాబాద్: వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' సినిమాకు గ్రీన్ సిగ్నల్ లభించింది. సినిమా మొత్తాన్ని చూసిన రివైజింగ్ కమిటీ కొన్ని కట్స్‌తో యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. దీనితో సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది.
ఈ విషయమై వర్మ.. ఈ నెల 12న చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించాడు. ‘దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ ఇంకా బతికే ఉందని తెలిసి థ్రిల్ అయ్యాను అని ట్వీట్ చేశారు. ముందుగా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాకు సెన్సార్ లైన్ క్లియర్ అయ్యిందని వర్మ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. అనంతరం సారీ.. సారీ అలవాటులో పొరపాటు అంటూ మరో ట్వీట్ ద్వారా విడుదల తేదీని ప్రకటించారు.
Next Story